అనుమానంతో భార్యను చంపిన భర్త

23 Jul, 2021 12:26 IST|Sakshi
నాన్కు(ఫైల్‌)

సాక్షి, నెల్లికుదురు(వరంగల్‌): అనుమనమే పెనుభూతమైంది. నమ్మించి భార్యను హత్య చేశాడు. ఈ ఘటన మండల పరిధిలోని కునాయికుంట తండాలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం, కునాయి కుంట తండాకు చెందిన గుగులోతూ యుగేందర్‌ జడ్చర్ల శివారు తండాకు చెందిన నాన్కు(30)కు ఏడేళ్ల క్రితం వివాహమైంది.  వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. యుగేందర్‌ బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. భార్య నాన్కు, ఇద్దరు కుమారులను యుగేందర్‌ తల్లిదండ్రుల వద్ద ఉంచాడు.అప్పుడప్పుడు వచ్చివెళ్తుండేవాడు.

ఈ క్రమంలో భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. బుధవారం హైదరాబాద్‌ నుంచి వచ్చిన యుగేందర్‌ భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాడు. గురువారం తెల్లవారు జామున భార్య నాన్కు హత్యకు గురైంది, సమాచారం అందుకున్న పోలీసులు ఎస్సై జితేందర్‌, తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ, సీఐ కరుణాకర్‌ ఘటన స్థలానికి చేరుకున్నారు. భార్యను హత్యచేసి పరారైన యుగేందర్‌ను పట్టుకున్నారు. స్టేషన్‌కు తరలిస్తుండగా మృతురాలి బంధువులు దాడిచేసే ప్రయత్నం చేయడా పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు