అందమే ఆమెకు శాపమైందా?.. అనుమానంతో భర్త కిరాతకం..

12 Sep, 2022 21:06 IST|Sakshi

ఖలీల్‌వాడి(నిజామాబాద్‌ జిల్లా): నగరంలో బ్యాంక్‌ కాలనీలో నివాసం ఉంటున్న మాలపల్లికి చెందిన అనీస్‌ ఫాతిమా (30)ను భర్త సయ్యద్‌ సుల్తాన్‌ చున్నీతో గొంతు బిగించి  చంపినట్లు ఒకటో టౌన్‌ ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు తెలిపారు. ఆయన కథనం మేరకు.. అనుమానంతో వేధించడంతో ఆమె ఏడాదిన్నరగా భర్తకు దూరంగా ఉంటోంది.
చదవండి: డ్యూటీకెళ్లిన భర్త.. ఇంటికొచ్చేసరికి భార్య అదృశ్యం.. చివరికి..

ఆమె  ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుండటంతో పిల్లలను చూసేందుకు సయ్యద్‌ సుల్తాన్‌ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి వెళ్లి భార్యతో గొడవపడి పడి చంపిన తర్వాత చేసి పిల్లలను వెంట తీసుకెళ్లాడు. కేసు పెట్టకపోతే పిల్లలను ఇస్తానని ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి ఆతర్వాత స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో వెల్లడించారు. 

మరిన్ని వార్తలు