భార్యపై పెట్రోల్‌ పోసి హత్య చేసిన భర్త

18 Mar, 2021 08:55 IST|Sakshi
భార్యపై పెట్రోల్‌ పోసిన భర్త ప్రవీణ్‌ మృతి చెందిన శిరీష (ఫైల్‌)

 పోలీసుల అదుపులో నిందితుడు

సాక్షి, ఏటూరునాగారం: కట్టుకున్న భర్త భార్యపై పెట్రోల్‌ పోసి హత్య చేసిన సంఘటన మండల కేంద్రంలోని తీగలవాయి ప్రాంతంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం. ఏటూరునాగారం మండలకేంద్రంలోని తీగలవాయి ప్రాంతానికి చెందిన గునిగంటి ప్రవీణ్‌కుమార్‌తో ఇదే మండలం చిన్నబోయినపల్లి పంచాయతీ హనుమాన్‌ నగర్‌కు చెందిన గొసు్కల జ్యోతి, నర్సయ్య కుమార్తె శిరీషతో రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. స్థానికంగా ఇద్దరూ నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాది బాబు కూడా ఉన్నాడు.

అనాథగా మారిన బాలుడు  

బుధవారం భార్యభర్తల మధ్య గొడవలు రావడంతో భర్త ప్రవీణ్‌కుమార్‌ భార్య శిరీషపై పెట్రోల్‌ పోసి నిప్పంటించగా మంటలు వ్యాప్తి చెంది శిరీష ఒల్లు కాలిపోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శిరీషను భర్త ప్రవీణ్‌ ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు భర్త ప్రవీణ్‌కుమార్‌ విలేకరులకు తెలిపారు. భార్య మృతదేహాన్ని వదిలేసి పారిపోయి తన నివాసానికి రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కానిస్టేబుల్‌ కృష్ణయ్య నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తల్లి మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో బాలుడు ఉన్నాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు