మహిళ గొంతు కోసిన భర్త

17 May, 2021 08:24 IST|Sakshi
చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్తున్న ఒడిశా వాసి రీటా-(ఇన్‌సెట్‌)లో గొంతు పై ఏర్పడిన గాయం

యడ్లపాడు (చిలకలూరిపేట): క్షణికావేశంలో ఓ యువకుడు తన భార్య గొంతును బ్లేడ్‌తో కోసిన ఘటన మండలంలోని బోయపాలెం గ్రామంలో ఆదివారం జరిగింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఫోపుల్‌ గనున్, రీటా దంపతులు కొద్దికాలం కిందట మండలానికి వలస వచ్చారు. బోయ పాలెం గ్రామంలోని ఓ నూలుమిల్లులో కార్మికులుగా పనిచేస్తున్నారు.

12 ఏళ్ల క్రితం వివాహమైన వారి మధ్య ఇటీవల కలహాలు మొదలయ్యాయి. తనను లెక్కచేయడం లేదన్న అక్కసుతో గనున్‌ భార్య రీటాపై ఆదివారం బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. స్థానికులు గమనించి అతన్ని పట్టుకుని విద్యుత్‌ స్తంభానికి కట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. యడ్లపాడు ఎస్‌ఐ పైడి రాంబాబు సిబ్బందితో ఘటనా స్థలికి వెళ్లి బాధితురాలు రీటాను చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంత జరిగినా తన భర్తపై ఫిర్యాదు చేయనని, స్టేషన్‌కు తీసుకెళ్లకుండా అతడిని విడిచి పెట్టాలని ఎస్‌ఐను రీటా కోరడం గమనార్హం.

చదవండి: టీడీపీ నేతల దాడి: ఇద్దరి పరిస్థితి విషమం  
కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరితే ఇల్లు దోచేశారు

మరిన్ని వార్తలు