పాలపొడి కోసం లొల్లి: గర్భిణిని చంపిన భర్త!

4 Apr, 2021 15:29 IST|Sakshi

ప్రాణం తీసిన క్షణికావేశం

కుమారుడికి పాలపొడి విషయంలో దంపతుల మధ్య వాగ్వాదం

భార్యపైకి ఇటుక విసిరిన భర్త

బలమైన గాయమై, చికిత్స పొందుతూ మృతి

సాక్షి, కమ్మర్‌పల్లి(నిజామాబాద్‌): కుమారుడికి పాలపొడి విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో ఒకరి ప్రాణం పోయింది. ఎస్సై శ్రీధర్‌గౌడ్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో యెల్మల గంగమణి, గంగాధర్‌ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం గంగమణి ఏడు నెలల గర్భిణి. కుమారుడికి పాలపొడి డబ్బా తీసుకురావాలని వారం క్రితం గంగమణి భర్తను కోరింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

గంగాధర్‌ కోపంతో సమీపంలోని ఇటుకను తీసుకుని భార్యపైకి బలంగా విసిరాడు. దీంతో ఆమె తలకు బలమైన గాయమైంది. ఆమెను కుటుంబ సభ్యులు నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స అందింనా పరిస్థితి మెరుగుపడలేదు. బతకడం కష్టమని వైద్యులు చెప్పడంతో శనివారం స్వగ్రామానికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి తండ్రి గంగారాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

చదవండి: ప్రాణం తీసిన అగ్గిపుల్ల, చూస్తుండగానే ఘోరం

పిల్లలను భయపెట్టేందుకు.. నీళ్లలో హిట్‌ కలుపుకుని

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు