భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు..

23 Jul, 2021 08:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, జ్యోతినగర్‌(కరీంనగర్‌): వేద మంత్రాల మధ్య తాళికట్టి జీవితాంతం తోడుంటానని వివాహం చేసుకుని ఆమెకు తెలియకుండానే మరో పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడిని ఎన్టీపీసీ పోలీసులు అరెస్టుచేశారు. వివరాల్లోకి వెళితే.. ఎన్టీపీసీ రామగుండం అన్నపూర్ణకాలనీకి చెందిన నవ్యతను మహదేవపూర్‌ మండల అన్నారం గ్రామానికి చెందిన మేదరి శేఖర్‌ 2018లో వివాహం చేసుకున్నాడు.

కొంతకాలంగా అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తుండడంతో నవ్యత పుట్టింటికి వెళ్లింది. ఈక్రమంలో శేఖర్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈమేరకు బాధితురాలు నవ్యత ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో విచారణ అనంతరం శేఖర్‌ను అరెస్టు చేసి గోదావరిఖని కోర్టులో హాజరు పరిచినట్లు ఎన్టీపీసీ ఎస్సై స్వరూప్‌రాజ్‌ తెలిపారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు