తల్లీకూతుళ్ల దారుణ హత్య.. అనుమానంతో భర్తే..

24 Jul, 2021 01:40 IST|Sakshi

భార్యపై అనుమానంతో ఘటన

రుద్రూర్‌ (వర్ని): భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను హతమార్చాడు. తల్లికి మద్దతిస్తోందనే కారణంగా కూతుర్ని కూడా కడతేర్చాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. బోధన్‌ మండలం పెద్ద మావందికుర్దు గ్రామానికి చెందిన మల్లీశ్వరికి రుద్రూర్‌కు చెందిన బోజేడి గంగాధర్‌తో సుమారు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కూతురు రుత్విక ఉంది. కొన్నేళ్ల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న గంగాధర్‌ ఆమెను వేధించేవాడు.

ఈ నేపథ్యంలో ఇటీవల పెద్దల సమక్షంలో నిర్వహించిన పంచాయితీలో కూతురు రుత్విక తల్లికి మద్దతుగా మాట్లాడింది. దీంతో తల్లీకూతుళ్లపై గంగాధర్‌ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున నిద్రిస్తున్న భార్య మల్లీశ్వరి (30), కూతురు రుత్విక (13)ను గొడ్డలితో నరి కి హత్య చేశాడు. ఇంటికి తాళం వేసి పోలీస్‌స్టేషన్‌ వెళ్లి లొంగిపోయాడు. బోధన్‌ ఏసీపీ రామారావు, రుద్రూర్‌ సీఐ అశోక్‌ రెడ్డి, ఎస్సై రవీందర్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృ తురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు బోధన్‌ ఏసీపీ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు