భార్యపై అనుమానంతో గొంతు కోసిన భర్త

9 Aug, 2021 09:31 IST|Sakshi
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

భార్య గొంతు కోసిన భర్త 

వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతోనే దారుణం

లింగసముద్రం: వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్య గొంతు కోసి కిరాతకంగా హతమార్చాడో భర్త.   ఈ ఘటన మండలంలోని అన్నెబోయినపల్లెలో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కొటికలపూడి నరసింహం, రమణమ్మ (47) భార్యభర్తలు. నరసింహం ప్రతి రోజూ మద్యం తాగొచ్చి వివాహేతర సంబంధ పెట్టుకుంటుందనే అనుమానంతో భార్యను చిత్రవధ చేసేవాడు.

ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున భార్యతో గొడవకు దిగి తీవ్ర ఆగ్రహంతో ఆమె జుట్టు పట్టుకుని కత్తితో గొంతు కోశాడు. రమణమ్మ కేకలు విని చుట్టుపక్కల వారు ఇంటి వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆమె  మరణించడంతో భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసులు, సీఐ శ్రీరాం, గుడ్లూరు ఎస్సై మల్లికార్జున సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

పరారీలో ఉన్న నరసింహాన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా రమణమ్మను తానే హతమార్చినట్లు ఒప్పుకొన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరికి నలుగురు అబ్బాయిలు. ఇద్దరికి వివాహమవ్వగా మరో ఇద్దరు హైదరాబాద్‌లో బేల్దారి పనులు చేస్తున్నారు.   
 

మరిన్ని వార్తలు