మూడేళ్ల క్రితం పెళ్లి.. రెండేళ్ల పాప.. భార్యతో గొడవపడి.. 

16 Aug, 2022 14:31 IST|Sakshi
శివకుమార్‌ (ఫైల్‌)

సాక్షి, రంగారెడ్డి: భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లెలగూడ బాలాజీనగర్‌లో నివసించే ఆవుల శివకుమార్‌(30), హారికలు భార్యాభర్తలు. వీరికి మూడేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల పాప ఉంది. శివకుమార్‌ టీకేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఉద్యోగం చేస్తున్నారు.

సోమవారం దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన శివకుమార్‌ బెడ్‌రూంలోని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి, మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు