భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య 

20 Sep, 2022 10:50 IST|Sakshi

గార్లదిన్నె:  భార్య పుట్టింటికి పోవడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన షాహినాకు గుంతకల్లు నివాసి జిలాన్‌ (38)తో వివాహమైంది. అదే గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో సొంత ఇల్లు నిర్మించుకుని బేల్దారి పనులతో జీవనం సాగించేవారు. పిల్లలు పుట్టకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకునేవి.

శనివారం భర్త గొడవ పడడంతో షాహిన  పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన జిలాన్‌ అదే రోజు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఇంటి నుంచి దుర్వాసన వెలువడుతుండడంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న జిలాన్‌ మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జమేదార్‌ దేవకుమార్‌ తెలిపారు.    

(చదవండి: వింత మనుషులు..చీకటి గదిలో నుంచి వెలుగులోకి)

మరిన్ని వార్తలు