మూడేళ్ల క్రితమే పెళ్లి.. వరుసకు బావతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో

4 Feb, 2022 16:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మంచిర్యాల: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాలలోని సున్నంబట్టివాడలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై అంజన్న, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వేమనపల్లి మండలం కాటేపెల్లి గ్రామానికి చెందిన బంధరికంటి సతీష్‌(29)కు కుమురంభీం జిల్లా పెంచికల్‌పేటకు చెందిన కవితతో 2018 మే 8న వివాహం జరిగింది. వీరికి కూతురు క్షేత్రియా(2) ఉంది. సతీష్‌ నాలుగేళ్ల క్రితం భార్య కవితతో మంచిర్యాలకు వలస వచ్చి కూలీ పని చేస్తుండేవాడు.
చదవండి: పిల్లను ఇవ్వడని మామపై కత్తితో దాడి.. ఆ కోపంలో మరదలిపైనా..

కవితకు బంధువు వరుసకు బావ అయిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని సతీష్‌ అనుమానించేవాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. పుట్టింటికి వెళ్లిపోయిన కవిత నెల రోజుల క్రితం మంచిర్యాలకు వచ్చింది. ఈ నెల 2న మళ్లీ గొడవలు జరగడంతో వెళ్లిపోయింది. దీంతో మనస్తాపంతో మద్యంమత్తులో ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకున్నాడు.  
చదవడి: కారం చల్లి, గొడ్డలితో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిపై దాడి.. ఆయుధాన్ని బీరువా కింద దాచి..

మరిన్ని వార్తలు