మరో మహిళతో సంబంధం.. భర్త కొట్టడంతో మనస్తాపం చెంది

27 Sep, 2022 12:06 IST|Sakshi
రాజ్యలక్ష్మి (ఫైల్‌) 

సాక్షి, సిద్దిపేట: భర్త వేధింపులు తాళలేక భార్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం జిల్లాలోని చిన్నకోడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన దాసరి రాజ్యలక్ష్మి (24)ని 2015లో చిన్నకోడూరుకు చెందిన శ్రీశైలంతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా శ్రీశైలం మూడేళ్లుగా అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరువురికి నచ్చజెప్పి సముదాయించారు. ఆదివారం రాజ్యలక్ష్మిని భర్త కొట్టడంతో మనస్తాపం చెంది రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అల్లుడు వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి దేవవ్వ ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: దసరాకి కొత్త దుస్తులు నాన్నా.. ఈ రోజే తెద్దాంలే కన్నా’.. అంతలోనే

మరిన్ని వార్తలు