ప్రేమ పెళ్లి.. నిత్యం వేధింపులు

21 Oct, 2020 10:46 IST|Sakshi
భర్త ఇంటి ఎదుట బైఠాయించిన రాణి

సాక్షి, కోనరావుపేట(వేములవాడ): వెంటపడ్డాడు.. ప్రేమించాడు.. పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేయడంతో ఆమె తల్లడిల్లిపోయింది. నిత్యం వేధింపులు తాళలేక తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. బాధితురాలి కథనం ప్రకారం.. కోనరావుపేట మ ండలం కొలనూర్‌కు చెందిన వీరవేణి పర్శరాములు–పద్మ దంపతుల కుమారుడు అజయ్‌ సిరిసిల్ల మండలం పెద్దూర్‌కు చెందిన ఇన్నారం దేవయ్య–మంగ దంపతుల కూతురు రాణి ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఓ యువకుడితో పెళ్లి నిశ్చయం చేయగా అజయ్‌ అడ్డుకున్నాడు. రాణిని తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆ సంబంధాన్ని చెడగొట్టాడు. ఆ తర్వాత పట్టించుకోక పోవడంతో రాణి తల్లిదండ్రులు కొలనూర్‌కు వచ్చి అజయ్‌ను నిలదీశారు. దీంతో అతను వారి కాళ్లు మొక్కి, రాణిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

ఆగస్టు 12న పెళ్లి...
అజయ్, రాణిలు ఆగస్టు 12న నిజామాబాద్‌లోని హనుమాన్‌ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అన ంతరం అజయ్‌ ఆమెను కొలనూర్‌లోని ఇంటికి తీ సుకెళ్లాడు. ఇది నచ్చని అతని తల్లిదండ్రులు, నాన మ్మ రాణిని చిత్రహింసలకు గురిచేశారు. నిత్యం కులం పేరుతో దూషించేవారు. ప్రతిరోజూ ఇంటి, పొలం పనులు చేయిస్తూ పస్తులుంచేవారు. వారి వేధింపులు తీవ్రం కావడంతో రాణి తల్లి ఈ నెల 14న ఆమెను ఇంటికి తీసుకెళ్లింది. తిరిగి మంగళవారం కొలనూర్‌కు వస్తే అజయ్‌ కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో రా ణి అత్తవారింటి ఎదుట బైఠాయించింది. బాధితులరాలికి మహిళా సంఘాలు, గ్రామస్తులు మద్దతు తెలిపారు. ప్రజాప్రతినిధులు, పోలీసులు తనకు న్యాయం చేయాలని రాణి వేడుకుంటోంది.

ఐపీఎల్‌ బెట్టింగ్‌ నిందితుల అరెస్టు
గోదావరిఖని(రామగుండం): ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిందితులను రామగుండం కమిషనరేట్‌ పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లాలోని సీసీసీ నస్పూర్‌ ఏరియాలో క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతూ కమీషన్లు తీసుకుంటున్న ప్రధాన నిందితుడు, ఆర్‌ఎంపీ జబ్రీ ఇక్బాల్‌తో సహా 15 మందిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా రామగుండం కమిషనరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ అడ్మిన్‌ అశోక్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. సీసీసీ నస్పూర్‌ ఏరియాలో భారీగా క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారన్న సమాచారం మేరకు రామగుండం సీసీఎస్‌ ఏసీపీ పీవీ.గణేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారన్నారు. మదర్‌ క్లినిక్‌ కేంద్రంగా ఈ దందా సాగుతోందని చెప్పారు. క్లినిక్‌ ఆర్‌ఎంపీ డాక్టర్‌ జబ్రీ ఇక్బాల్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌కు దిగేవారిని ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. 2019లోనూ ఇక్బాల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాలడినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. అతని బ్యాంక్‌ ఖాతాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.

నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం...
క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న 15 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు  డీసీపీ అడ్మిన్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. ప్రధాన నిందితుడు జబ్రి ఇక్బాల్‌తో పాటు సీసీసీ నస్పూర్‌కు చెందిన జబ్రి హాధి, జబ్రి అఖిల్, కొమ్మెర విజయ్, ఎండీ.ఫహీమ్, సుంకరి సాగర్, అనుమాస్‌ సంతోష్‌కుమార్, నేదూరి శ్రీనివాస్, అగ్గు కిరణ్, అగ్గు స్వామి, చిట్యాల ప్రశాంత్, సూరిమిల్ల కార్తీక్, చాతరాజు శరత్‌చంద్ర, మాచర్ల సాయి, కోట ఉదయ్‌రాజ్‌లను అరెస్టు చేశామన్నా రు. మంచిర్యాల మారుతినగర్‌కు చెందిన దేవేందర్‌ పరా రీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.1.40 లక్షలు, 16 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడి ంచారు. అనంతరం నిందితులతో ప్రతిజ్ఞ చేయించారు.

బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి
యువత బెట్టింగ్‌లకు దూరంగా ఉండి, తమ విలువైన భవిష్యత్‌ను కాపాడుకోవాలని డీసీపీ అడ్మిన్‌ అశోక్‌కుమార్‌ సూచించారు. క్రికెట్‌ బెట్టింగ్‌లపై పోలీసుల నిఘా కొనసాగుతోందని, ఎలాంటి సమాచారం అందినా ఆకస్మిక దాడులు నిర్వహిస్తామన్నారు. బెట్టింగ్‌లో పాల్గొంటే కేసులు నమోదు చేయడంతో పాటు, పలుమార్లు ఇదే వ్యవహారంలో దొరికితే పీడీయాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏసీపీ గణేష్, సీఐలు రమణబాబు, వెంకటేశ్వర్, వెంకటేశ్వర్లు, సైబర్‌ క్రైం సీఐ బి.స్వామి, ఎస్బీ సీఐ టి.నారాయణ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు