భర్త వివాహేతర సంబంధం.. భార్యకు తెలిసి..

25 Nov, 2022 07:42 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం కలిగి ఉండడంతో భార్య ఆవేదకు గురైంది. బిడ్డకు ఉరివేసి హత్య చేసి తరువాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. నైలై జిల్లా  వెంకటాచలపురానికి చెందిన మహేంద్రన్‌ భార్య ప్రవీణ (25) ఉంది. అహిమా అనే ఏడాదిన్నర వయసున్న ఆడబిడ్డ కూడా ఉంది.

కూలీ పనులు చేసుకునే.. మహేంద్రన్‌కు మరో యువతితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి ఘర్షణ జరిగింది. ఆ తర్వాత మహేంద్రన్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రవీణ బిడ్డను హత్య చేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడింది. దేవరకులం పోలీసులు మృతదేహాలను స్వాధీనం పోస్టుమార్టం కోసం నెలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: (కుమార్తె ప్రేమవివాహం.. ఆటోతో ఢీకొట్టి.. చనిపోయాడనుకొని..)

మరిన్ని వార్తలు