పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పిన వినని భార్య.. దీంతో..

7 Jun, 2021 11:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హోసూరు(కర్ణాటక): భార్య అక్రమ సంబంధం భర్తను రాక్షసునిగా మార్చేసింది. వివాహేతర సంబంధం మానుకోవాలని చెప్పినా పట్టించుకోకపోవడంతో భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... సింగారపేట సమీపంలోని మల్లిపట్టి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ అమల్‌రాజ్‌ (31), ఇతని భార్య రంజిత (28)లు తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.

వీరికి ఒక కుమార్తె ఉంది. ఇదిలా ఉంటే రంజిత అదే ప్రాంతానికి చెందిన తంగరాజ్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న భర్త తీవ్రంగా హెచ్చరించాడు. అయినా అతని మాటలు లెక్క చేయకపోవడంతో శనివారం రాత్రి భార్య గొంతు నులిమి హత్య చేశాడు. సింగారపేట పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. 

చదవండి: ఒక పెళ్లి.. రెండు బరాత్​లు.. ట్విస్ట్​ ఏంటంటే..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు