దారుణం.. టీ పెట్టలేదని భార్యను చపాతీ పీటతో కొట్టి చంపిన భర్త

27 Dec, 2022 07:39 IST|Sakshi

ఉజ్జయిని: టీ తయారు చేసి ఇవ్వలేదనే కోపంతో దుర్మార్గుడైన ఓ భర్త కట్టుకున్న భార్యను చపాతీ పీటతో కొట్టి కడతేర్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా ఘటియా గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(41) టీ తయారు చేసి ఇవ్వలేదనే కోపంతో భార్య(40)ను చపాతీ పీటతో కొట్టాడు. స్పృహతప్పి పడిపోయిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. విద్యుత్‌ షాక్‌కు గురైందని వైద్య సిబ్బందితో అబద్ధమాడాడు. కొద్ది సేపటి తర్వాత భార్య చనిపోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. పోస్టుమార్టంలో విషయం బయటపడగా భర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు.
చదవండి: ఫ్రెండ్స్‌తో అడవిలో మందు తాగుతుండగా ఈడ్చుకెళ్లిన పులి.. సగం తిని..

మరిన్ని వార్తలు