Banjarahills: భార్యను చంపి.. గడ్డిలో చుట్టేశాడు

23 Sep, 2021 09:39 IST|Sakshi
రేఖ మృతదేహం

సాక్షి, బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్న వ్యక్తి తన భార్యను హత్య చేసి పరారైన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.5లోని దుర్గా భవానీనగర్‌ను ఆనుకొని ఉమెన్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీలో ఓ బిల్డర్‌ వద్ద చత్తీస్‌ఘడ్‌కు చెందిన అటల్‌ పార్థి, రేఖా పార్థి(32) గతేడాది కాలంగా పని చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

ఈ నేపథ్యంలోనే మూడు రోజుల క్రితం వారిద్దరి మధ్య గొడవ తీవ్రమవడంతో అటల్‌ తన భార్య రేఖను హత్య చేసి అదే ప్లాట్‌ ప్రహరీ వెంబడి గడ్డిలో చుట్టి పడేశాడు. ఇది గమనించి చుట్టుపక్కల వారు జూబ్లీహిల్స్‌ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పరారీలో ఉన్న భర్త అటల్‌పార్థీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: నల్లగొండ: పట్టపగలే దారుణం.. మధ్యవయస్కురాలిపై హత్యాచారం

మరిన్ని వార్తలు