వివాహమైన మూడు నెలలకే భార్యపై అనుమానం.. లాడ్జీకి పిలిపించి.. 

14 May, 2022 11:40 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: అనుమానంతో భార్యను కట్టుకున్న భర్తే దారుణంగా హత్య చేశాడు. సిద్దిపేట జిల్లా నిజాంపేటకు చెందిన ముడావత్‌ శంకర్‌కు మెదక్‌ జిల్లా శంకరంపేటకు చెందిన శిరీషతో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. శంకర్‌ నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్‌లో జరుగుతున్న రోడ్డు నిర్మాణంలో పనిచేస్తున్నాడు. అయితేశీ రీషపై శంకర్‌ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆ జంట మధ్య గొడవలు జరగడంతో కొన్ని రోజులుగా తన పుట్టింటిలోనే ఉంటుందది

కాగా శంకర్‌ తన భార్య శిరీష(21)ను శుక్రవారం రాత్రి నల్లగొండ పట్టణానికి పిలిపించుకున్నాడు. ఇద్దరు కలిసి పట్టణంలోని బస్టాండ్‌ ఎదురుగా ఉన్న పున్నమి లాడ్జీలో రూం తీసుకున్నారు. లాడ్జీలో శంకర్‌ తన భార్య శిరీష హత్య చేశాడు. పెళ్లయిన మూడు నెలలకే శంకర్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. నల్లగొండ టుటౌన్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.   
చదవండి: ప్రేమ వివాహం.. అర్ధరాత్రి నిద్ర లేచి..

మరిన్ని వార్తలు