భార్య కేసు పెట్టిందని టవరెక్కిన భర్త

22 Jun, 2021 13:10 IST|Sakshi

సాక్షి, మాచారెడ్డి(నిజామాబాద్‌): భార్య కేసు పెట్టిందని ఓ భర్త టవరెక్కిన సంఘటన సోమవారం గజ్యానాయక్‌ తండా చౌరస్తాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలలలోని సోమారంపేటకు చెందిన ఉమేష్‌ మూడేళ్ల కిందట మేడ్చల్‌కు ప్రియాంక అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి యేడాదిన్నర పాపఉంది.

గత కొద్దిరోజులుగా తాగుడుకు బానిసైన ఉమేష్‌ తరచుగా కొడుతుండడంతో భరించలేక మాచారెడ్డి ఠాణాలో ప్రియాంక కేసు పెట్టింది. దీంతో తనను పోలీసులు కొడుతారేమోననే భయంతో ఉమేష్‌ టవర్‌ ఎక్కాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నచ్చాచెప్పారు. దాంతో టవర్‌ దిగిన ఉమేష్‌ భార్య, కూతురును తీసుకుని ఇంటి ముఖం పట్టాడు. 

చదవండి: ప్రియుడి ఇంట్లో ప్రియురాలి ఆత్మహత్యాయత్నం

మరిన్ని వార్తలు