మూణ్నెళ్ల క్రితం ప్రేమ వివాహం.. భార్య కాపురానికి రావడం లేదని..

27 Jul, 2021 09:02 IST|Sakshi

సాక్షి, లింగంపేట(నిజామాబాద్‌): మండలంలోని పొల్కంపేట గ్రామంలో ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన దాసరి సురేష్‌(24) మూణ్నెళ్ల క్రితం బొల్లారం తండాకు చెందిన దేవసోత్‌ శిరీషను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దంపతుల మధ్య నెలకొన్న గొడవలతో నెల రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. తిరిగి అత్తారింటికి రమ్మన్నా ఆమె రావడం లేదు. దీంతో తన భార్య మళ్లీ కాపురానికి వస్తుందో లేదో అని సురేష్‌ తీవ్ర మనస్తాపానికి గురైయ్యాడు.

ఈక్రమంలో శనివారం జీవితంపై విరక్తి చెంది అతడు బయటకవెళ్లాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు గ్రామంలో వెతికినా ఆచూకి లభించలేదు. సోమవారం పెద్దవాగులోని చెక్‌డ్యామ్‌ వద్ద సురేష్‌ మృతదేహం లభింంది. మృతుడికి తల్లి దేవేంద్ర, తండ్రి భూమయ్య ఉన్నారు.మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు