నా చావుకు భార్య, అత్తింటివారే కారణం..

22 Aug, 2021 12:29 IST|Sakshi
ప్రదీప్‌ (ఫైల్‌)

సాక్షి, దుగ్గొండి(వరంగల్‌): నన్ను నిత్యం అత్తింటివారు వేధిస్తున్నారు.. భార్య సహా ఆమె కుటుంబ సభ్యులంతా మానసికంగా హింసిస్తున్నారు. వారి హింస భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా.. నా చావుకు నా భార్య, ఆమె కుటుంబ సభ్యులే కారణమంటూ ఓ యువకుడు వాయిస్‌ రికార్డు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం దేశాయిపల్లిలో శనివారం జరిగింది. దేశాయిపల్లికి చెందిన తుత్తూరు ప్రదీప్‌(25)కు భార్యతో, ఆమె కుటుంబ సభ్యులతో నిత్యం గొడవలు జరుగుతున్నాయి.

వారి వేధింపులు భరించలేక ఈ నెల 19న బంధంపల్లికి చేరుకున్న ప్రదీప్‌.. తన చావుకు భార్యతో పాటు ఆమె తరుఫు బంధువులే కారణమని వాయిస్‌ రికార్డు చేసి తండ్రి నగేష్‌కు పంపి గడ్డిమందు తాగాడు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు హన్మకొండలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ ప్రదీప్‌ శనివారం మృతి చెందాడు. మృతుని తండ్రి నగేష్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ట్రెయినీ ఎస్సై మహేందర్‌ తెలిపారు. 

చదవండి: ఏడేళ్ల విడాకుల కొట్లాట: ఇగోతో బిలియన్ల కోసం..! ఇది వీళ్ల కథ..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు