ప్రేమ పెళ్లి, ఆరునెలలకే మరొకరితో..

11 Sep, 2022 11:39 IST|Sakshi

తిరువొత్తియూరు: ప్రేమించి వివాహం చేసుకున్న భార్య మరొకరితో పారిపోవడంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నామక్కల్‌ జిల్లా ఎరుమపట్టి, బోడినాయకన్‌పట్టి తూర్పు వీధికి చెందిన షణ్ముగం కుమారుడు విమల్‌కుమార్‌ (20) నామక్కల్‌ బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న ధర్మపురికి చెందిన విద్యార్థినిని ప్రేమించి ఆరునెలల క్రితం ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నాడు.

నామక్కల్‌లోని అతని తాత ఇంట్లో కాపురం పెట్టాడు. ఈ క్రమంలో మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య అతనితో కలిసి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన విమల్‌కుమార్‌ ఇంట్లో శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

చదవండి: వీడియో తీయొద్దు అన్నందుకు.... డ్యూటీలో ఉన్న పోలీస్‌ని గట్టిగా కరిచి పరార్‌..

మరిన్ని వార్తలు