భార్య మరణాన్ని తట్టుకోలేక.. లారీ కిందకు దూకి భర్త సూసైడ్‌

16 Jul, 2023 12:33 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల జిల్లా: లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామంలో  విషాదం చోటు చేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక భర్త లారీ కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం పక్కింటి వాళ్లతో  గొడవ పడిన భార్య శరణ్య.. పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఆమె చికిత్స పొందుతూ కరీంనగర్‌ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది.

భార్య శవాన్ని ఇంటికి తీసుకువస్తుండగా మధ్య మార్గంలో లక్షిట్ పెట్ ఉత్కూర్ చౌరస్తాలో భర్త మల్లికార్జున్ మనస్తాపంతో లారీ కిందకి దూకి సూసైడ్‌ చేసుకున్నాడు. భార్య, భర్తలు ప్రాణాలు‌ కోల్పోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. తల్లిదండ్రులు ప్రాణాలు  కోల్పొవడంతో వారు తీవ్రంగా విలపిస్తున్నారు.
చదవండి: సంచలనం... నాగేంద్రబాబు హత్యకు వివాహేతర సంబంధమే కారణం...

మరిన్ని వార్తలు