ప్రముఖ సింగర్‌కు వేధింపులు.. షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్టర్‌ అరెస్ట్‌

17 Jul, 2021 08:23 IST|Sakshi

సాక్షి, నాగోలు: నగరానికి చెందిన మెడికాయల నవీన్‌కుమార్‌ (34) షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ ప్లేబ్యాక్‌ సింగర్‌తో నవీక్‌కుమార్‌ గతంలో ఇంటర్వ్యూ చేశాడు. ఆమె ఫొటోను లోగోగా ఉంచి ఆమె పేరు మీద ఒక యూట్యాబ్‌ చానెల్‌ ప్రారంభించాడు. తరువాత బాధితురాలి పేరు మీద ఒక చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించాడు. అతను తన వెబ్‌ సిరీస్‌ వీడియోలు, ఆల్బమ్‌ సాంగ్స్, షార్ట్‌ ఫిల్మ్స్‌ వీడియోలు అప్‌లోడ్‌ చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న సింగర్‌ ఇలాంటి కార్యకాపాలను ఆపమని అతడిని కోరింది. అయినా నిందితుడు ఆమె మాటలు పట్టించుకోలేదు. సింగర్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధిన వీడియాలు అప్‌లోడ్‌ చేస్తూ ఆమెను మానసికంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని శుక్రవారం నవీన్‌కుమార్‌ అరెస్టు చేసి రిమాండ్‌ తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు