స్నేహితుడి భార్యపై కన్నేసిన దుర్మార్గుడు.. అత్యాచారం, వీడియోలు తీసి!

8 Nov, 2021 19:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గాజుల రామారంలోని నెహ్రూ నగర్‌కు చెందిన ప్రశాంత్‌ జీడిమెట్ల భాగ్యలక్ష్మీ కాలనీలో ఉంటున్న స్నేహితుడి ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. ఈ క్రమంలో స్నేహితుడి భార్యపై కన్నేశాడు. తనను ప్రేమించకపోతే చచ్చిపోతానంటూ స్నేహితుడి భార్యను ప్రశాంత్‌ వేధింపులకు గురిచేశాడు. ఇదే క్రమంలో వివాహితపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా లైంగిక దాడికి సంబంధించిన వీడియోలు రికార్డ్‌ చేశాడు.
చదవండి: అన్నం పెట్టడం లేదని కొడుకుతో చెప్పిన తల్లి.. కోడలు క్షణికావేశంలో..

వీడియోలు చూపించి మళ్లీ అత్యాచారానికి ఒడిగడుతూ వచ్చాడు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే ఆమెను, ఆమె పిల్లలు, భర్తను చంపేస్తానని బెదిరించాడు. వీడియోలను అడ్డుపెట్టి డబ్బులు ఇవ్వాలని వివాహితను డిమాండ్‌ చేశాడు. లేదంటే వీడియోలు వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు. ఈ నేపథ్యంలో బాధితురాలి నుంచి ఇప్పటి వరకు రూ. 16 లక్షలు వసూలు చేశాడు.

అయినా వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.  నిందితుడు ప్రశాంత్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: రెండేళ్లుగా సహజీవనం.. కూతురుపై తల్లి ప్రియుడు లైంగిక దాడి..

మరిన్ని వార్తలు