వెలుగులోకి వచ్చిన మోసగాడి వ్యవహారాలు

11 Nov, 2020 08:54 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్‌లో గన్‌మెన్‌గా పని చేస్తున్న సబ్‌–ఇన్‌స్పెక్టర్‌గా చెప్పుకుంటూ పలువురిని మోసం చేసి శనివారం వెస్ట్‌జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులకు చిక్కిన ఎన్‌.సంతోష్‌ వ్యవహారంలో ఆసక్తికరమైన కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఇతడిని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించిన లంగర్‌హౌస్‌ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. చదవండి: కరోనా ఎఫెక్ట్‌: పెళ్లి ఆలోచన పెరిగింది.. 

► రేతిబౌలి, ఖదీర్‌బాగ్‌కు చెందిన ఎన్‌.సంతోష్‌ టెన్త్‌ వరకు మాత్రమే చదివాడు. కొన్నాళ్లు ఓ సివిల్‌ కాంట్రాక్టర్‌ దగ్గర ఎలక్ట్రీషియన్‌గా పని చేసిన అతను ఆపై కారు డ్రైవర్‌గా మారాడు. 
► నగరానికి చెందిన ఓ కారు రెంటల్‌ సంస్థకు తన ఆధార్, రెండు ఖాళీ చెక్కులు ఇచ్చి కారు అద్దెకు తీసుకునేవాడు. అనంతరం దీనిని తీసుకుని దూరప్రాంతాలకు కిరాయికి వెళ్తుండేవాడు.  
► గతంలో సమాచార హక్కు చట్టం ప్రధాన కార్యాలయంలో పని చేసే ఓ అధికారి వద్ద కాంట్రాక్ట్‌ పద్దతిలో డ్రైవర్‌గా పని చేశాడు. ఈ నేపథ్యంలో ఇతడికి సఫారీ డ్రస్‌ వేసుకోవడం అలవాటు కావడంతో ఇప్పటికీ కొనసాగిస్తూ వచ్చాడు.   
► కొన్నాళ్ల క్రితం ఓ రిజర్వ్‌ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ (ఆరెస్సై) అతడి కారును బుక్‌ చేసుకుని బయటి జిల్లాకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన టోల్‌గేట్స్‌ వద్ద తన గుర్తింపు కార్డు చూపిస్తూ మినహాయింపు పొందారు. 
► దీనిని చూసిన సంతోష్‌కు ఓ ఆలోచన వచ్చింది. నిత్యం కిరాయికి బయటి ప్రాంతాలకు వెళ్లే తన వద్ద కూడా ఇలాంటి కార్డు ఉంటే తానూ టోల్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయింపు పొందవచ్చని, ఇలా ప్రతి ట్రిప్‌లోనూ అదనంగా రూ.వెయ్యి వరకు లాభపడచ్చని భావించాడు. 
► దీనిని అమలులో పెడుతూ... సదరు ఆరెస్సైకి చెందిన గుర్తింపుకార్డును  ఫొటో తీసుకున్నాడు. ఫొటోషాప్‌ సాఫ్ట్‌వేర్‌ సహాయంతో అందులో మార్పులు చేసి తన పేరు, ఫొటో ఏర్పాటు చేసుకున్నాడు. 
► అప్పటికే సఫారీ డ్రస్‌  వేసుకుంటున్న సంతోష్‌ కొత్తగా వచ్చిన నకిలీ గుర్తింపుకార్డులతో తాను సూడో పోలీసుగా మారాలనుకున్నాడు. అమెజాన్‌ నుంచి పిస్టల్‌ ఆకారంలో ఉన్న సిగరెట్‌ లైటర్‌ను రూ.850 వెచి్చంచి కొనుగోలు చేశాడు.

► ఓ సందర్భంలో ఓఆర్‌ఆర్‌ మీదుగా వెళ్తూ... అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది చేతిలో వాకీటాకీ చూశాడు. వెంటనే వారి వద్దకు వెళ్లిన ఇతగాడు దాన్ని చూస్తానంటూ తీసుకుని చేతిలో పట్టుకుని ఫొటోలు దిగాడు. 
► సీఎం కేసీఆర్‌ తన అంగరక్షకులతో దిగిన ఫొటోను ఇంటర్‌నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేశాడు. ఇందులో ఆయనకు ఎడమ వైపున ఉన్న భద్రతా సిబ్బంది ఫొటోను ఫొటోషాప్‌ ద్వారా మారి్ఫంగ్‌ చేసి తన ఫొటో అతికించాడు.  
►తన ఫోన్‌లో స్నేహితులు, బంధువుల నంబర్లను ‘కలెక్టర్‌ ఆఫీస్, సీఎం 2, సీఎం క్యాంప్‌ ఆఫీస్, సీబీఐ రవీంద్ర’ పేర్లతో సేవ్‌ చేసుకున్నాడు. దీంతో వారు కాల్‌ చేసినప్పుడు ఈ పేర్లే వచ్చేవి. స్నేహితులతో కూర్చున్నప్పుడు ఈ కాల్స్‌ వస్తే భారీ బిల్డప్‌ ఇచ్చేవాడు.  
► వీటన్నింటినీ వినియోగిస్తూ తాను ప్రగతి భవన్‌లలో పని చేస్తున్న గన్‌మెన్‌గా అనేక మందికి పరిచయం చేసుకున్నాడు. ఉద్యోగాలు, రుణాలు ఇప్పిస్తానంటూ అనేక మంది నుంచి డబ్బు వసూలు చేశాడు. ఒత్తిడి చేసిన వారికి తిరిగి చెల్లించేశాడు.

మరిన్ని వార్తలు