కిడ్నాప్‌ కేసు: 24 గంటల్లో చేధించిన పోలీసులు

29 Jan, 2021 15:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముసారాంబాగ్‌లో కిడ్నాప్  కేసును పోలీసులు 24 గంటల్లో చేధించారు. ఆ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ వివరించారు.. ఈ నెల 27న ముసారాంబాగ్ ఎస్‌బీఏ ఎదురుగా తల్లిదండ్రులతో కలిసి అమ్ములు అనే చిన్నారి నిద్రిస్తుండగా.. అదే సమయంలో కాలవల శ్రవణ్ అనే వ్యక్తి పాపను కిడ్నాప్ చేశాడని తెలిపారు. అనంతరం పాప తండ్రి అజయ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని‌ అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గతంలో నిందితుడు శ్రవణ్ కుమార్ ఆటో నడుపుతూ నేరాలకు పాల్పడేవాడని అంజనీ కుమార్‌ తెలిపారు. నిందితుడిపై మలక్ పేట్, కాచిగూడ, సరూర్ నగర్, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులున్నాయన్నారు. చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

రంగారెడ్డి: పలు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. మాహేశ్వరం ఎంపీడీఓ కార్యాలయంలో, మాన్సాన్ పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మహేశ్వరం మండల్ పంచాయతీ ఆఫీసర్ శ్రీనివాస్ రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. లేఅవుట్ విషయంలో శ్రీనివాస్‌ లంచం డిమాండ్‌ చేయగా..ఏడున్నర లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఐదున్నర ఎకరాల భూమి లే అవుట్ అనుమతి ఇవ్వడం కోసం అధికారులులంచం డిమాండ్ చేయగా ..ఇదే కేసులో ఐదున్నర లక్షలు తీసుకుంటూ పంచాయతీ సెక్రటరీ గీత, సర్పంచ్ భర్త రమేష్, ఉప సర్పంచ్ దొరికారు.

మరిన్ని వార్తలు