రియల్టర్‌ భాస్కర్‌రెడ్డి హత్య కేసులో విచారణ

8 Aug, 2021 13:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నెల్లూరుకు చెందిన రియల్టర్‌ భాస్కర్‌రెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హత్య కేసులో కీలక సూత్రధారి అయిన త్రిలోక్‌నాథ్‌ బాబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుని కోసం బెంగళూరు, చెన్నై, ఏపీలో పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే మల్లేష్, సుధాకర్, కృష్ణంరాజు, ఆర్‌ఎంపీ డాక్టర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయిఏ హత్య వెనుక అసలు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాబా అక్రమాలను ప్రశ్నించినందుకే హత్య చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ డబ్బు, గుప్త నిధుల వ్యవహారంపై ఆరా తీస్తున్నారు.

కాగా హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారి గత నెల కిడ్నాప్‌ అయిన విషయం తెలిసిందే. ఆహారంలో మత్తుమందు కలిపి హాస్టల్ నుంచి వ్యాపారి కిడ్నాప్ చేసి అనంతరం గుట్టుచప్పుడు కాకుండా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్‌ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలంగా విజయ్‌భాస్కర్‌ను కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు కంటపడ్డాయి. కారు నంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేయగా.. నలుగురు కలిసి భాస్కర్‌ను హత్య చేసినట్లు బయటపడింది. మాజీ సైనికోద్యోగి మల్లేశ్‌ కుమారుడు భాస్కర్‌ ఉండే హాస్టల్‌లో చేరి నమ్మకంగా ఉంటూ ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చినట్లు తేలింది. స్పృహ కోల్పోయిన విజయ్‌ను కొందరు కారులో తీసుకెళ్లి శ్రీశైలంలోని సున్నింపెట వద్ద కాటికాపరిని బెదిరించి మృతదేహాన్ని ఖననం చేయించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు