ఫ్యాషన్‌ డిజైనింగ్‌ ముసుగులో వ్యభిచారం.. బిల్‌ కలెక్టర్‌ బాగోతం

2 Jul, 2021 13:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కుషాయిగూడ: ఫ్యాషన్‌ డిజైనింగ్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళ గుట్టును కుషాయిగూడ, మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు రట్టు చేశారు. నిర్వాహకురాలితో పాటుగా విటుడు, వ్యభిచారానికి పాల్పడుతున్న యువతిని అరెస్టు చేసిన ఘటన గురువారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ వాసవీశివనగర్‌ పార్కు సమీపంలో ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్న సునీతా మండల్‌ (40) అనే మహిళ ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేస్తూ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది.

విషయం తెలిసిన కుషాయిగూడ, మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపారు. అదే ఇంట్లో ఇటీవలే అద్దెకు దిగిన బిల్‌ కలెక్టర్‌ వావనగారి మహాదేవ్, ఓ యువతితో కలిసి బెడ్‌రూంలో ఉండగా రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిర్వాహకురాలు సునీతా మండల్, విటుడు మహదేవ్‌తో పాటుగా వ్యభిచారానికి పాల్పడుతున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, రెండు సెల్‌ఫోన్లు, బైక్‌ను స్వా«దీనం చేసుకున్నారు. గతంలో ఆమెపై జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయిందన్నారు. గురువారం కేసు నమోదు చేసి నిందితులను మేజిస్రేట్‌ ఎదుట హాజరుపరిచినట్లు వివరించారు.  

చదవండి: KPHB Colony: యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి..

మరిన్ని వార్తలు