హత్యా.. ఆత్మహత్యా! ముఖంపై గాయాలు.. పరారీలో భర్త

6 Oct, 2021 14:34 IST|Sakshi
పరుశరాం, లక్ష్మి దంపతుల ఫొటో (ఫైల్‌) 

మృతురాలి ముఖంపై గాయాలు..

పరారీలో భర్త..  

గోప్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు..

సాక్షి, కుషాయిగూడ: హెచ్‌బీకాలనీ, రాజీవ్‌నగర్‌లో మహిళ మృతిచెందిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలి ముఖంపై గాయాలు, మెడకు తాడు బిగించినట్లు కనిపిస్తున్న గుర్తులు చూస్తుంటే ఆమెది హత్యా.. ఆత్మహత్యా.. అనే సందేహం వస్తోంది. సోమవారం రాత్రి కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాజీవ్‌నగర్‌లో లక్ష్మీ అనే గృహిణి అనుమానాస్పదంగ మృతిచెందిన విషయం తెలిసిందే.  భర్త పరుశరాం పరారీలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
చదవండి: మణికొండ: యువతితో క్యాబ్‌ డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన 

సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన పరుశరాం కొంత కాలం క్రితం నగరానికి వచ్చి కూలీ పనిచేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడి కంటే వయసులో పెద్దదైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మితో ఏర్పడిన పరిచయం కాస్తా పెళ్లి వరకు దారితీసింది. మృతురాలు లక్ష్మీది రెండో వివాహం అని తెలుస్తోంది. గత ఐదు నెలల క్రితమే హెచ్‌బీ కాలనీ, రాజీవ్‌నగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని కొత్తగా సంసారం పెట్టారు. ఇద్దరూ కూలి పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. నిత్యం మద్యం తాగే అలవాటున్న వీరు రోజూ  తాగి ఇంటికి వచ్చి గొడవ పడటం తరచుగా జరిగేదని ఇంటి యజమాని తెలిపారు.
చదవండి: మహిళతో ఇద్దరికి వివాహేతర సంబంధం, ప్రాణం తీసింది

ఈ క్రమంలోనే పరుశరాం భార్యను హత్య చేసి పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మృతురాలి ముఖంపై గాయాలు, చెవి, ముక్కు, నోరు, కళ్లలోంచి కారుతున్న రక్తం మరకలు, గొంతుపై కనిపిస్తున్న చారలను బట్టి ఆమెది హత్యేనన్న అనుమానాలకు బలం చేకురుస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు గోప్యంగా వ్యవహరిస్తున్నారు. పరారీలో ఉన్న భర్త పరుశరాంను అదుపులోకి తీసుకున్నారా లేదా అనే సమాచారాన్ని పోలీసులు ఇవ్వడం లేదు. 

మరిన్ని వార్తలు