బాబాయ్‌ అంటే భయం.. అదే అలుసుగా తీసుకుని మూడు రోజులుగా..

11 Jun, 2022 08:35 IST|Sakshi
నిందితుడు షేక్‌ సలీమ్‌

బాలికపై ఆటో డ్రైవర్‌ లైంగికదాడి 

నిందితుడికి స్థానికుల దేహశుద్ధి 

పోలీసులకు అప్పగింత

సాక్షి,నాగోలు(హైదరాబాద్‌): మీ బాబాయ్‌కి చెప్పి కొట్టిస్తానని బెదిరించి ఓ ఆటో డ్రైవర్‌ బాలికపై లైంగికదాడికి పాల్పడిన సంఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన బాలిక(09) తల్లితో కలిసి నివాసం ఉంటుంది. వారి ఎదురింట్లో ఉంటున్న షేక్‌ సలీమ్‌ (30) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు  పిల్లలు ఉన్నారు. తరుచు గొడవ పడుతుండటంతో కొద్ది రోజుల క్రితం అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

ముడు నెలలుగా ఒంటరిగా ఉంటున్న సలీమ్‌ ఇంటి ఎదురుగా ఉన్న బాలికపై కన్నేసిన అతను మూడు రోజులుగా పలు మార్లు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. సదరు బాలికకు ఆమె బాబాయ్‌ అంటే భయం ఉండడంతో  ఈ విషయం బయట చెప్తే మీ బాబాయ్‌కి చెప్పి కొట్టిస్తానని బెదిరించడం ఆమె మిన్నకుంది. గురువారం బాధితురాలు సలీమ్‌ ఇంట్లో వెళ్లికి రావడాన్ని గుర్తించిన పక్క ఉండే మరో ఆమె తల్లి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆమె బాలికను నిలదీయడంతో రోజులుగా సలీమ్‌ తనపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు చెప్పింది. దీంతో ఆమె స్థానికుల సహాయంతో  సలీమ్‌ను పట్టుకుని అతడిని చితకబాది ఎల్‌బీనగర్‌ పోలీసులకు అప్పచెప్పారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం వనస్థలిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  నిందితుడు షేక్‌ సలీమ్‌ను ఎల్‌బీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అతడిని కోర్టులో హాజరుపరిచారు.

చదవండి: తప్పుడు వాంగ్మూలం ఇవ్వలేదనే?.. గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద మృతిపై సందేహాలు
 

మరిన్ని వార్తలు