అప్పు కోసం బ్యాంకుకు వెళ్లిన మహిళా కానిస్టేబుల్‌కు షాక్‌.. పాన్‌ కార్డుపై అప్పటికే..

9 Dec, 2021 14:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రుణం కోసం బ్యాంకుకు వెళ్లిన ఓ మహిళా కానిస్టేబుల్‌కు విస్తుపోయే నిజం తెలిసింది. తన ప్రమేయం లేకుండా తన పేరుపై ఇతర రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి లోను తీసుకున్న విషయాన్ని బ్యాంకు అధికారులు చెప్పడంతో.. షాక్‌కు గురై సిటీ సైబర్‌ క్రైం పోలీసుల్ని ఆశ్రయించింది. వివరాలు.. సిటీ సైబర్‌ క్రైం పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తి స్తున్న మహిళా కానిస్టేబుల్‌కు డబ్బులు అవస రం కావడంతో రుణం కోసం ఎస్‌బీఐకు వెళ్లింది. 

కానిస్టేబుల్‌ వివరాలు చెక్‌ చేసిన బ్యాంక్‌ అధికారులు ఆల్రెడీ మీ పేరుపై రూ.80 వేలు రుణం ఉన్నట్లు తెలిపారు. తన ప్రమేయం లేకుండా లోను ఎవరు తీసుకున్నారని ఆరాతీయగా.. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి కానిస్టేబుల్‌ పాన్‌కార్డ్‌పై లోను తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆమె సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యా దు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధు తెలిపారు.
చదవండి: ఈ టిప్స్‌ పాటిస్తే.. మీ ఆధార్‌ కార్డు సేఫ్‌..లేదంటే? దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే

మరిన్ని వార్తలు