హైదరాబాద్‌లో మరో పరువు హత్య.. కేసులో పురోగతి

21 May, 2022 18:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో బేగంబజార్‌కు కోల్సివాడికి చెందిన నీరజ్‌ పన్వార్‌ (21) అనే యువకుడిని కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేయగా, మరో 10 మందిని కూడా అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు.

పరువు హత్య?
వివరాల ప్రకారం.. బేగంబజార్‌కు కోల్సివాడికి చెందిన నీరజ్‌ పన్వార్‌ (21) శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో అతని భార్య సోదరులు, వారి స్నేహితులను కిరాతకంగా హతమార్చారు. ఆ వెంటనే కర్ణాటకలోని గుడిమిత్కల్ ప్రాంతానికి వారు పారిపోయారు. రెండు వాహనాల పై వెళ్ళిన ఐదుగురు హంతకులు మృతుడు నీరజ్ భార్య సంజన కజిన్ బ్రదర్స్, వారి ముగ్గురు స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు కర్ణాటక గుడిమత్కల్లో నిందితులు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుడిమిత్కల్‌లో వారిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే మొత్తం 10మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

నీరజ్‌ పోస్టుమార్టంపై ప్రాథమిక నివేదిక
నీరజ్‌ పోస్టుమార్టంపై ప్రాథమిక నివేదికను ఫోరెన్సిక్‌ వైద్యులు వెల్లడించారు. నీరజ్‌ శరీర భాగాల్లో పలుచోట్ల గాయాలు గుర్తించారు ఫోరెన్సిక్‌ వైద్యులు. నీరజ్‌ తల, మెడ, ఛాతి భాగాల్లో 10కిపైగా కత్తిపోట్లు గుర్తించారు.దీనికి సంబంధించిన ప్రాథమికి నివేదికన పోలీసులకు అందజేశారు వైద్యులు.

చదవండి: హైదరాబాద్‌లో మరో పరువు హత్య?.. బేగంబజార్‌లో యువకుడిని ఘోరంగా చంపిన దుండగులు

మరిన్ని వార్తలు