మైలార్‌దేవ్‌పల్లిలో కిడ్నాప్‌ కలకలం

18 Apr, 2021 08:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యువకుడి కిడ్నాప్‌ ఉదంతం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కలవరం రేపింది. మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం.. దూద్‌బౌలి ప్రాంతానికి చెందిన అల్తాఫ్‌హుస్సేన్‌(27)కు.. మైలార్‌దేవ్‌పల్లి కింగ్స్‌ కాలనీకి చెందిన ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈమెకు ఇటీవల ఇదే ప్రాంతానికి చెందిన నదీంఖాన్‌(28)తో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.

విషయం తెలుసుకున్న అల్తాఫ్‌హుస్సేన్‌ శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి నదీంఖాన్‌ను కిడ్నాప్‌ చేశాడు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న నదీమ్‌ విధులు ముగించుకుని రాత్రి 10.30 గంటల బైక్‌పై ఇంటికి బయలుదేరగా.. మార్గ మధ్యలో వాహనం ఆపిన అల్తాఫ్‌.. నదీమ్‌ను కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లాడు. స్థానికులు ఏం జరుగుతుందో అనుకునేలోపే కారు దూసుకెళ్లిపోయింది. బాధితుడి కుటుంబ సభ్యులు, మైలార్‌దేవుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

నిందితులు సంగారెడ్డిలో ఉన్నారని మైలార్‌దేవుపల్లి పోలీసులకు సమాచారం రావడంతో తెల్లవారుజామునే ఆ ప్రాంతానికి వెళ్లి అల్తాఫ్‌ను అదుపులోకి తీసుకుని నదీంఖాన్‌ను రక్షించారు. అపహరణ తరువాత కొద్ది దూరం కారులో వెళ్లి తర్వాత అల్తాఫ్‌ ఇంటికెళ్లిపోయాడు. నిందితులు మొదట నదీంఖాన్‌ను బీదర్‌కు తీసుకెళ్లాలనుకున్నా.. సంగారెడ్డి వరకూ వెళ్లినట్లు తెలుస్తోంది. కిడ్నాపర్లు నదీం నుంచి రూ.10వేలను తీసుకున్నారు. 

( చదవండి:  ప్రేయసికి నిశ్చితార్థం: అంతలోనే కిడ్నాప్‌ చేసిన లవర్‌ )

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు