సూసైడ్‌ నోట్‌ రాసి.. బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య 

10 May, 2022 07:32 IST|Sakshi
అనిల్‌ (ఫైల్‌)

సాక్షి, చైతన్యపురి: ‘నా చావుకు ఎవరూ కారణం కాదని’ సూసైడ్‌ నోట్‌ రాసి ఓ బీటెక్‌ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రంగారెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా, రాచూరు గ్రామానికి చెందిన గుత్తి బాలయ్య కుమారుడు అనిల్‌ కుమార్‌ అవంతి కళాశాలలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గత కొంతకాలంగా అతను  స్నేహితుడితో కలిసి న్యూ దిల్‌సుఖ్‌నగర్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.

ఈ నెల 6న స్నేహితుడు సొంతూరుకు వెళ్లగా అనిల్‌ ఒక్కడే గదిలో ఉన్నాడు. రెండు రోజులుగా అద్దెకు ఉంటున్న వారు కనిపించకపోవడంతో సోమవారం  ఇంటి ఓనర్‌ గది వద్దకు వెళ్లి చూడగా లోపల గడియ పెట్టి వుంది. కిటికీ లోనుంచి చూడగా అనిల్‌కుమార్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. గదిలో పోలీసులు తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉన్న  సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు.   

చదవండి: (Hyderabad: అపార్ట్ మెంట్‌లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులను..)

మరిన్ని వార్తలు