Telugu Academy Money Fraud: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌.. విచారణ వేగవంతం చేసిన సీసీఎస్‌

30 Sep, 2021 17:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీలో నిధులు గోల్‌మాల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో సీసీఎస్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీనిపై ఇప్పటి వరకు సీసీఎస్ పోలీసులకు మూడు ఫిర్యాదులు అందాయి. సుమారు 63 కోట్ల రూపాయలు గోల్ మాల్ అయినట్లు అకాడమీ అధికారులు సీసీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు మూడు ఫిర్యాదులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
(చదవండి: తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్‌)

ఇప్పటికే పోలీసులు పలు బ్యాంక్ అధికారులను సీసీఎస్‌కు తరలించి విచారిస్తున్నారు. వీరిలో యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, అగ్రాసేన్ బ్యాంకు ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు వీరిని విచారిస్తున్నారు. 

చదవండి: టీడీపీ పాలనలో ‘అకాడమీ’కి అస్థిత్వమే లేదు

మరిన్ని వార్తలు