హైదరాబాద్‌: వెలుగులోకి ఘరానా మోసం.. ఆన్‌లైన్‌ జాబ్‌, వర్క్‌ ఫ్రమ్‌ హోం అంటూ రూ.50 కోట్ల మేర వసూలు!!

6 Jul, 2022 16:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగుల బలహీనతలను క్యాష్‌ చేసుకుంటూ.. ఆన్‌లైన్‌ జాబ్‌, వర్క్‌ఫ్రమ్‌ హోం పేరిట భారీ మోసానికి పాల్పడిన ఓ కంపెనీ బాగోతం హైదరాబాద్‌లో బయటపడింది. డిజినల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ.. యూఎస్ బేస్డ్‌ కంపెనీ అంటూ పెద్ద ఎత్తునే చీటింగ్‌కు పాల్పడింది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ స్కామ్‌ వెలుగు చూసింది.

నెలకు మూడు లక్షల రూపాయలకు పైనే జీతం అంటూ మోసం భారీ మోసానికి పాల్పడిందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది డిజినల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌. బాధితుల కథనం ప్రకారం.. పుస్తకాలు స్కాన్ చేసి పంపాలంటూ కస్టమర్స్‌కు వర్క్ ఫ్రం హోం అప్పజెప్పింది సదరు కంపెనీ. అంతర్జాతీయ పుస్తకాలు, నవలలు డిజిటల్‌ చేస్తామని. ప్రతీ పేజీకి రూ.5 చొప్పున ఇస్తామని ప్రకటించింది. అయితే పదివేల పేజీల స్కానింగ్‌ కోసం డిపాజిట్లను వసూలు చేసింది. డిపాజిట్‌ పేరిట ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి ఐదు లక్షల యాభై వేల రూపాయలు వసూలు చేసింది. 

ఆరు నెలల్లో తిరిగి మీడబ్బు మీకే వస్తుందంటూ కోట్ల రూపాయలు వసూలు చేసింది. వెయ్యి మంది నుంచి సుమారు రూ. 50 కోట్లు మేర డిపాజిట్‌ కట్టించుకుని జెండా ఎత్తేసినట్లు కంపెనీ మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిజినల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఎండీ అమిత్ శర్మపై హైదరాబాద్  సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు. శర్మతో పాటు విజయ్‌ఠాగూర్‌ అనే వ్యక్తి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు