హైదరాబాద్‌: లోన్‌ యాప్‌ సంస్థలపై ఈడీ కొరడా.. వెలుగులోకి చైనా కంపెనీల గోల్‌మాల్‌

6 Jul, 2022 19:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని లోన్‌ యాప్‌ సంస్థలపై ఈడీ కొరడా ఝుళిపించింది. నాలుగు కంపెనీలపై దాడి చేసి.. రూ.86 కోట్లను ఫ్రీజ్‌ చేసింది. దీంతో.. ఇప్పటిదాకా రూ.186 కోట్ల నగదును ఈడీ ఫ్రీజ్‌ చేసినట్లు అయ్యింది. 

కుడుస్‌ ఫైనాన్స్‌, ఎస్‌ మనీ, రహినో, పయనీర్‌.. కంపెనీల్లో సోదాలు చేపట్టింది. దేశ చట్టాలకు వ్యతిరేకంగా చైనా కంపెనీలు 940 కోట్ల రూపాయల డబ్బు వసూలు చేసినట్లు, హవాలా ద్వారా విదేశాలకు చైనా కంపెనీలు ఆ డబ్బు పంపించాయని నిర్ధారించుకుంది ఈడీ.

లోన్‌ యాప్‌ మోసాలు, ఎంతో మంది బాధితులు, మరెంతో మంది జీవితాలు నాశనం అవుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. లోన్‌ యాప్‌లపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వాలు సిద్ధం అయ్యాయి. ఈ క్రమంలోనే.. దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టోరేట్‌ విచారణలో దూకుడు చూపెడుతోంది. మరోపక్క నగర పోలీస్‌ శాఖ కూడా లోన్‌ యాప్‌ మోసాల మీద ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది.

చదవండి: హైదరాబాద్‌: నెలకు మూడు లక్షల జీతమంటూ ఘరానా మోసం!

మరిన్ని వార్తలు