మాజీ ఆర్మీ ఉద్యోగి.. ఛీ ఇదేం పాడు బుద్ధి.. కన్న కూతుళ్లనే

2 Jun, 2021 08:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కూతుళ్లపై మాజీ ఆర్మీ ఉద్యోగి లైంగిక వేధింపులు

 సాక్షి, హైదరాబాద్‌: నగరంలో నివాసముంటున్న మాజీ ఆర్మీ ఉద్యోగి తన రెండో భార్యతో కలిసి ఇద్దరు కుమార్తెలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఉప్పల్‌ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. నగరానికి చెందిన ఆర్మీ జవాన్‌ హిమాచల్‌ప్రదేశ్‌లో విధులు నిర్వహించేవాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. పిల్లలు నగరంలోని అమ్మమ్మ ఇంట్లో ఉండేవారు.

2016లో భార్య మృతి చెందడంతో సిటీలో ఉన్న పిల్లలకు తెలియకుండా దహన కార్యక్రమాలు నిర్వహించాడు. ఆ తరువాత కొద్దిరోజులకే మరో వివాహం చేసుకున్నాడు. అయితే తల్లి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ, తండ్రి వ్యవహారశైలిని తప్పుపడుతూ కుమార్తెలు అక్కడి ఆర్మీ ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి తిరిగి వచ్చారు. తరచూ సిటీకి వచ్చి వేధిస్తుండటంతో ఆర్మీ అధికారులు తండ్రి పనిచేసే ప్రాంతంలోనే క్వార్టర్స్‌ కేటాయించారు. ఇది జీర్ణించుకోలేని అతను.. భార్యతో కలిసి పిల్లలు నివాసముండే ప్రాంతానికి వెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. తరువాత బలవంతంగా హైదరాబాద్‌ తీసుకువచ్చి వదిలివెళ్లాడు.

ఆ తరువాత వీఆర్‌ఎస్‌ తీసుకొని అంబర్‌పేటలో నివాసముంటున్నాడు. కూతుళ్లను ఇక్కడికే పిలుచుకువచ్చి వేధింపుల పర్వం కొనసాగించాడు. బాధితులు గతంలో అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు మందలించి పంపించారు. ఈ వేధింపులు ఇంకా పెరగడంతో స్థానికుల సహకారంతో ‘సఖి’ సంస్థకు చేరవేశారు. ఉప్పల్‌ చేరుకున్న సంస్థ ప్రతినిధులు చిన్నారులను రెస్క్యూ చేసి తమ హోమ్‌కు తరలించారు.   గత నెల 24న ఉప్పల్‌ ఠాణాలో పెద్ద కుమార్తె తన తండ్రి, సవతి తల్లిపై ఫిర్యాదు చేశారు. పోక్సో యాక్ట్‌తో పాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు వీఆర్‌ఎస్‌ తీసుకున్న ఆ ఆర్మీ జవాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

చదవండి: దారుణం: భార్యతో గొడవపడి.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కి.. 

మరిన్ని వార్తలు