‘మా కుమారుడి మృతిపై అనుమానాలున్నాయి’ 

25 Oct, 2021 14:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పోలీసుల తీరుపై మృతుడి తల్లిదండ్రుల ఆందోళన 

సాక్షి, రాజేంద్రనగర్‌: సెల్లార్‌లో ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడు గుంతలో శవమై తేలిన మృతిపై తమకు అనుమానాలున్నాయని తల్లితండ్రులు అపర్ణ, శివశంకర్‌ అన్నారు. న్యూఫ్రెండ్స్‌ కాలనీలోని కేఆర్‌ అపార్ట్‌మెంట్‌లో వారు నివసిస్తుండగా గురువారం మధ్యాహ్నం ఇద్దరు కుమారులు సెల్లార్‌లో ఆడుకుంటూ అనీష్‌ (6) కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. మరుసటి రోజు అతను ఓ గుంతలో పడి శవమై కనిపించాడు.

ఆదివారం బాలుడి తల్లితండ్రులు విలేకరులతో మాట్లాడుతూ.. తమ కుమారుడి మొహంపై గీతలు ఉన్నాయని, రక్తం కారిందని, కన్ను గుడ్డు లేదని తెలిపారు. ఇన్ని అనుమానాలు ఉన్నా పోలీసులు మాత్రం ఆడుకుంటూ పడి మృతి చెందినట్టు కేసును మూసివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమ కుమారుడిని ఎవరో చంపి అందులో వేసినట్టు తమకు అనుమానాలు ఉన్నాయని ఆ దిశగా దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు. 
చదవండి: కూతుళ్లే పుట్టారని వేధింపులు.. తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య  

మరిన్ని వార్తలు