వీడు మనిషేనా.. కన్న తండ్రే కామాంధడిలా మారి.. 

20 Jul, 2021 08:26 IST|Sakshi

కూతురిని నాలుగు నెలల గర్భవతిని చేసిన కసాయి తండ్రి 

సాక్షి, బంజారాహిల్స్‌( హైదరాబాద్‌): కన్న కూతురిపై ఓ కిరాతక తండ్రి లైంగికవాంఛలు తీర్చుకున్న ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దంపతులు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.79లోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద వాచ్‌మెన్లుగా ఉంటున్నారు. ఈ నెల 16వ తేదీన వీరి కూతురు(16) వాంతులు చేసుకుంటుండగా తల్లి నాంపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తీసుకెళ్లింది.

అక్కడి వైద్యులు బాలికను పరీక్షించగా ఆమె నాలుగు నెలల గర్భవతి అని తెలిపారు. దీంతో కంగుతున్న తల్లి ఏం జరిగిందని కూతురిని నిలదీసింది. గత కొంత కాలంగా తల్లి పనికి వెళ్లిన తర్వాత తన తండ్రి(38) నిద్రమాత్రలు భోజనంలో కలిపి కూతురికి తినిపించే వాడని, నిద్రపోయిన తర్వాత కూతురిని అత్యాచారం చేసేవాడని చెప్పింది. కొంత కాలం క్రితం తల్లి కాకినాడకు వెళ్లగా అదే రోజు రాత్రి తండ్రి పీకల దాకా మద్యం సేవించి కూతురిపై అత్యాచారం చేయడమే కాకుండా ఈ విషయం తల్లికి కానీ, ఇంకెవరికైనా చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించాడని చెప్పింది. ఈ విషయాన్ని తన భార్య దృష్టికి కూతురు తీసుకొచ్చిందన్న విషయం తెలిసిన వెంటనే రెండు రోజుల క్రితం తండ్రి పరారయ్యాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 376(3), పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు