డైరీలో.. మమ్మీ నేను బతకడానికి వెళ్తున్నా, నా కోసం..

9 Sep, 2021 11:03 IST|Sakshi

సాక్షి,చందానగర్‌( హైదరాబాద్‌): చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ విద్యార్థిని అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన మేరకు.. వికారాబాద్‌ జిల్లా, బషీరాబాద్‌కు చెందిన  ఆకార దేవికారాణీ రాజేష్‌ దంపతులు పాపిరెడ్డి కాలనీలో నివాసముంటున్నారు. వారి కుమార్తె ఆకార ఉజ్జయిని (18) డిగ్రీ చదువుతోంది. తండ్రి మందలించడంతో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. ఒక డైరీలో  మమ్మీ నేను బతకడానికి వెళ్తున్నాను, నన్ను వెతకకూడదని రాసిపెట్టి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  
 

మరో ఘటనలో...

గచ్చిబౌలిలో బిల్డర్‌ అదృశ్యం 
గచ్చిబౌలి(హైదరాబాద్‌):  మీటింగ్‌ ఉందని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ బిల్డర్‌ అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఏఎస్‌ఐ సాయులు తెలిపిన మేరకు.. గచ్చి            బౌలిలోని ఏపీహెచ్‌బీ కాలనీ ఎంఐజీలో నివాసముండే సుప్ర బిల్డర్‌ ఎ.అశోక్‌(49) ఈనెల 5వ తేదీ సాయంత్రం శంషాబాద్‌లో మీటింగ్‌ ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. తెల్లవారినా ఇంటికి రాకపోవడం, రెండు ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులు తెలిసిన చోట వాకబు చేశారు. ఆచూకీ లబ్యం కాకపోవడంతో బుధవారం గచ్చిబౌలి పీఎస్‌లో కుమారుడు యోగేష్‌ కుమార్‌ ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన రోజు ముగ్గురు వ్యక్తులు ఇంటికి వచ్చి తన తండ్రితో మాట్లాడి Ðð వెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: Doctor Missing Case: వీడని మిస్టరీ.. డాక్టర్‌ జయశీల్‌రెడ్డి ఏమయ్యారు?

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు