సర్టిఫికెట్స్ జిరాక్స్ కోసం వెళ్ళింది.. సాయంత్రమైనా రాకపోయేసరికి..

18 Aug, 2021 10:02 IST|Sakshi

సాక్షి, నల్లకుంట( హైదరాబాద్): సర్టిఫికెట్స్ జిరాక్స్‌ తీసుకువస్తానని చెప్పి వెళ్లిన డిగ్రీ రెండో సంవత్సరం విద్యారి్థని అదృశ్యమైన  ఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లకుంటకు చెందిన బీఆర్‌ ఇందిర, నాగరాజు దంపతుల కుమార్తె శ్రావణి అలియాస్‌ డాలి (23) బీఎన్‌రెడ్డి నగర్‌లో సాయి గాయత్రీ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నది. అక్కడే హాస్టల్‌లో ఉంటుంది.

గత నెలలో డిగ్రీ పరీక్షలు ముగియడంతో హాస్టల్‌ ఖాళీ చేసి ఇంటికి వచ్చింది. ఈ నెల 16న ఉదయం 10:30 గంటల సమయంలో వాళ్ల ఇంట్లో ఉండే రూపతో కలిసి సర్టిఫికెట్స్ జిరాక్స్‌ తీసుకుస్తానని చెప్పి వెళ్లిన శ్రావణి సాయంత్రం వరకు తిరిగి రాలేదు.  బీఎన్‌ రెడ్డిలోని హాస్టల్‌కు ఫోన్‌ చేసి  వాకబు చేయగా ఆమె అక్కడికి రాలేదని హాస్టల్‌ నిర్వాహకులు తెలిపారు. దీంతో ఆందోళన చెందిన రూప సరి్టఫికెట్స్‌ జిరాక్స్‌ కోసం వెళ్లిన శ్రావణి కనిపించడం లేదంటూ నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్‌  కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణి అదృశ్యంపై ఆమె స్నేహితులు చిట్టి, రామ్‌ నాయక్‌లపై అనుమానం ఉందని రూప పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కాగా ఈ ఫొటోలోని యువతి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే నల్లకుంట పోలీసులకు సమాచారం ఇవ్వాలని  పోలీసులు తెలిపారు

మరిన్ని వార్తలు