కాలేజ్‌కి వెళ్తున్నానని చెప్పి బయటికి వెళ్లి..

11 Jun, 2022 11:38 IST|Sakshi
కె. ఐశ్వర్య (ఫైల్‌)

సాక్షి,చాంద్రాయణగుట్ట(హైదరాబాద్‌): ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫలక్‌నుమా జంగమ్మెట్‌ ప్రాంతానికి చెందిన వీరస్వామి కూతురు కె.ఐశ్వర్య (17) ఈ నెల 1వ తేదీ ఉదయం 9 గంటలకు కళాశాలకు వెళుతున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో  తన  సోదరి కనిపించడం లేదని అన్న లోకేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

చదవండి: బాబాయ్‌ అంటే భయం.. అదే అలుసుగా తీసుకుని మూడు రోజులుగా..

మరిన్ని వార్తలు