భార్యా భర్తల మధ్య గొడవ, కోపంలో గొంతు నులిమి..

14 Jul, 2021 21:43 IST|Sakshi

సాక్షి, షాబాద్‌( హైదరాబాద్‌): అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్యను గొంతు నులిమి హత్య చేసిన సంఘటన షాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. షాబాద్‌ సీఐ అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్‌ గ్రామానికి చెందిన వడ్డే రమేష్‌కు గత పదేళ్ల కిందట మొయినాబాద్‌ మండలం శ్రీరాంనగర్‌ గ్రామానికి చెందిన అనితతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

కొన్ని రోజులుగా భర్త రమేష్‌కు భార్య అనిత ఫోన్‌లో వేరే వ్యక్తితో మాట్లాడుతుందని అనుమానం వచ్చింది. సోమవారం రాత్రి భార్యా భర్తల మధ్య మాటామాట పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులు విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మంగళవారం మృతురాలి తల్లి సుగుణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు