పరాయి వ్యక్తితో భార్య సహజీవనం.. గదికి బయట నుంచి తాళం వేసి

20 May, 2022 11:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భార్య పరాయి పురుషుడితో గదిలో ఉండగా బయటి నుంచి తాళం వేసిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త తన భార్యతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా అప్పగించి తనకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశాడు. వివరాలివీ... జూబ్లీహిల్స్‌ రహ్మత్‌నగర్‌లోని యాదగిరినగర్‌లో నివసిస్తున్న మహిళ(35)కు ఇద్దరు పిల్లలు. భర్త సరిహద్దుల్లో పని చేస్తుంటాడు.

గురువారం ఉదయం యాదగిరినగర్‌లో తన భార్య జ్ఞానేశ్వర్‌ అనే వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్నట్లుగా తెలుసుకొని అక్కడికి వెళ్లి బయటి నుంచి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని తాళం తీసి విచారణ చేపట్టారు. ఈ ఇంటిని ఆమె అద్దెకు తీసుకునే ముందు జ్ఞానేశ్వర్‌ తన భర్త అంటూ ఓనర్‌ను నమ్మించి కొంత కాలంగా ఉంటున్నట్లుగా విచారణలో తేలింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు