యువకుడితో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్న భర్తని..

10 Aug, 2021 21:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో భర్తను చంపిన భార్యను, సహకరించిన ప్రియుడిని హబీబ్‌నగర్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు వారిపై   కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన  వివరాల ప్రకారం... మాన్గార్‌ బస్తీకి చెందిన ఉప్పాడే రోషన్‌(25)కు అదే బస్తీకి చెందిన లతకు  పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడ, ఒక మగ సంతానం ఉన్నారు.

రోషన్‌ ఓ హోటల్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. లతకు స్థానికుడైన కాంబ్లే యువరాజ్‌ పరిచయం అయ్యారు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో లతకు యువరాజ్‌ దగ్గరయ్యారు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు తెలినప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. దీంతో రోజూ భార్య భర్తల మధ్య  ఘర్షణ జరిగేది.  తమ ప్రేమకు అడ్డువస్తున్నాడనే కారణంతో  భర్త రోషన్‌ను ఎలాగైనా అంతమొందించాలని భార్య లత నిర్ణయించుకుంది. ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం  మద్యం సేవించి ఇంటికి వచ్చిన రోషన్‌ను భార్య లత, ప్రియుడు కాంబ్లే యువరాజ్‌ కలిసి కత్తితో పొడిచి చంపారు. ఈ కేసులో ఇరువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా తామే హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు. ఈ మేరకు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు