భర్త ఇంటికి వచ్చేసరికి భార్యతో సహా పిల్లలు..

8 May, 2021 09:33 IST|Sakshi

సాక్షి ,చాంద్రాయణగుట్ట( హైదరాబాద్‌) : నలుగురు పిల్లలతో కలిసి ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చాంద్రాయణగుట్ట ఘాజిమిల్లత్‌ కాలనీ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ రఫీ, అతియా బేగం (29) దంపతులు. వీరికి తన్వీర్‌ బేగం (13), మహ్మద్‌ హైదర్‌ (12), మహ్మద్‌ సోహేల్‌ (10), మెహాక్‌ బేగం (8) సంతానం. కాగా ఈ నెల 4న భర్త మహ్మద్‌ రఫీ తన సోదరుణ్ని వదిలేందుకు గుల్బార్గాకు వెళ్లాడు.

అనంతరం ఈ నెల 5వ తేదీ రాత్రి 6.30 గంటలకు రఫీ తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్యతో పాటు నలుగురు పిల్లలు కనిపించకుండా పోయారు. దీంతో  భార్యకు ఫోన్‌ను చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. దీంతో ఆందోళనకు చెందిన  రఫీ  పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 040–27854763 నంబర్‌లో సంప్రదించాలన్నారు.   

( చదవండి: కొడుకును బావిలో పడేసి...ఆపై తండ్రీ ఆత్మహత్య )

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు