TG Venkatesh: బంజారాహిల్స్‌లో భూకబ్జా ముఠా హల్‌చల్‌.. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌పై కేసు

18 Apr, 2022 09:25 IST|Sakshi

62 మంది రౌడీల అరెస్టు 

రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, విశ్వప్రసాద్‌పై కేసు   

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లోని ప్రభుత్వ స్థలంలోకి ఆదివారం కొందరు రౌడీలు మారణాయుధాలతో ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో సంబంధమున్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, అతని అన్న కుమారుడు విశ్వ ప్రసాద్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లో ఏపీ జెమ్స్‌ అండ్‌ జ్యువెల్లెర్స్‌కు ప్రభుత్వం 2005లో కేటాయించిన రెండున్నర ఎకరాల్లో అర ఎకరం స్థలాన్ని ఓ వ్యక్తి బోగస్‌ పత్రాలతో ఆక్రమించుకున్నాడు. తన ఆధీనంలోకి తీసుకున్న ఈ స్థలాన్ని ఎంపీ టీజీ వెంకటేష్‌ అన్న కుమారుడు విశ్వప్రసాద్‌కు విక్రయించాడు.

చదవండి: పరువు హత్య కలకలం..  తాళ్లతో కట్టేసి.. తలపై మేకులు కొట్టి.. 

విశ్వప్రసాద్‌ ఆదివారం 80 మంది రౌడీలను మారణాయుధాలతో ఈ ప్రభుత్వ స్థలంలోకి పంపించాడు. వారు ఈ స్థలంలోకి ప్రవేశించి అక్కడున్న సెక్యురిటీ గార్డుల్ని కొట్టి బయటకు తరిమారు. రౌడీమూకల దౌర్జన్యంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు అక్కడికి చేరుకుని 62 మంది రౌడీలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన రౌడీలు పరారయ్యారు. ఈ సంఘటనపై బంజారాహిల్స్‌ పోలీసులు ఎంపీ టీజీ వెంకటేశ్, విశ్వప్రసాద్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు