మహేష్ బ్యాంకు హ్యాక్‌ కేసు.. షాకింగ్‌ విషయాలు వెల్లడి

30 Mar, 2022 11:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహేష్ బ్యాంకు నిధుల గోల్మాల్ కేసులో కీలక పురోగతి కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు సర్వర్లను హ్యాక్ చేసి నేరగాళ్లు నిధులను కొట్టేశారు. బ్యాంకు ఖాతాలతో పాటు సర్వర్‌లో చొరబడి 14 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. నిధులు కాజేసిన ప్రధాన సూత్రధారిని నగర పోలీసులు గుర్తించారు. నైజీరియా నుంచే బ్యాంకు సర్వర్లను హక్ చేసి డబ్బు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఇప్పటి వరకు ఇదే తరహాలో మూడు బ్యాంకుల నిధులను నేరాగాళ్లు కొట్టేశారు. అందులో.. మహారాష్ట్రలో బ్యాంక్ ఆఫ్ బరోడా, తెలంగాణ కోపరేటివ్ బ్యాంకు, మహేష్ నిధులను లూటీ చేశారు. మహేష్ బ్యాంకు కేసులో ఇప్పటి వరకు 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్‌లో ఉండి నైజీరియన్ కి సపోర్ట్ చేసిన కీలక సూత్రధారి అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకుల దోపిడిలపై కీలక విషయాలను హైదరాబాద్ సీపీ వెల్లడించనున్నారు.

చదవండి: Mahesh bank Fraud Case: తప్పించుకునేందుకు భవనం నుంచి దూకిన నైజీరియన్‌

మరిన్ని వార్తలు